Sunitha : తన మధురమైన గానంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ సింగర్ సునీత గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే సింగర్ సునీత ఇప్పటి వరకు కొన్ని వందల పాటలు పాడింది. ఇందులో ఇప్పటికీ చాలామందికి సింగర్ సునీత పాట పాడిన పాటలు తమ ఫేవరేట్ సాంగ్స్ లిస్టు లో ఉంటాయి. అయితే సింగర్ సునీత పాడిన టువంటి పాటలు మాదిరిగానే సునీత కూడా చక్కని ముఖ కవళికలు అందం అభినయం సాంప్రదాయమైన కట్టుబొట్టు వంటివాటితో ఎంతో అందంగా ఉంటుంది.
దీంతో అప్పట్లో కొందరు దర్శక నిర్మాతలు సింగర్ సునీత కి సినిమా ఆఫర్లు కూడా ఆఫర్ చేసినప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల సింగర్ సునీత సున్నితంగా తిరస్కరించింది. అయితే సింగర్ సునీత గాన రంగంలో భాగానే రాణించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో సింగర్ సునీత మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో సమస్యలన్నీ సర్దుమనుగడంతో సింగర్ సునీత తన వ్యక్తిగత జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో సింగర్ సునీత సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వంటివి చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది. అయితే తాజాగా సింగర్ సునీత తన అధికారిక ఖాతాలో క్యూట్ గా స్మైల్ ఇస్తూ దిగినటువంటి ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతే కాకుండా సింగర్ సునీత పాటలు మాదిరిగానే సునీత కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే వయసుతో పని లేకుండా సింగర్ సునీత కి అందం రోజు రోజుకి పెరుగుతుందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య సింగర్ సునీత తన వ్యక్తిగత జీవితం లో బిజీగా ఉండటంతో పాటలు పాడటం లేదు. దీంతో సునీత అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. అయితే సింగర్ సునీత ఆ మధ్య మ్యాంగో మీడియా సంస్థల యజమాని అయిన రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకుంది.