Singer Sunitha: సింగర్ సునీత గారు కాస్త ఒళ్ళు చేశారు.. కానీ చాలా అందంగా ఉన్నారు!

Akashavani

Singer Sunitha: సింగర్ సునీత ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకున్న సునీత పలు సినిమాలకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. సునీత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే రెండవ వివాహం చేసుకుని తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సునీత రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

సునీత రెండో వివాహం చేసుకున్న సమయంలో ఎంతోమంది ఆమె రెండో వివాహం చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.అయితే ప్రస్తుతం ఈమె ఆనందంగా ఉండడం చూసి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక రెండవ పెళ్లి తర్వాత సునీత తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా తన వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈమె తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

Singer Sunitha: సింగర్ సునీత గారు కాస్త ఒళ్ళు చేశారు.. కానీ చాలా అందంగా ఉన్నారు!
Singer Sunitha: సింగర్ సునీత గారు కాస్త ఒళ్ళు చేశారు.. కానీ చాలా అందంగా ఉన్నారు!

Singer Sunitha: ఇలాగే సంతోషంగా ఉండండి..

ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సునీత తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నటువంటి ఫొటోలు, వీడియోలను షేర్ చేసిన ఈమె తాజాగా హాలిడే వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అద్భుతమైన లొకేషన్లలో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఎంతో అందంగా ఉన్న సునీత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు చూసి ఎంతో మంది నెటిజన్లు మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ కామెంట్లు చేయడమే కాకుండా… సునీత గారు మీరు కాస్త ఒళ్ళు చేశారు ..అయినా ఎంతో అందంగా ఉన్నారు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సునీతకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -