Siri -Shrihan: సిరి హనుమంతు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వారికి ఈమె ఎంతో సుపరిచితమే. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన రొమాన్స్ అందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోవడంతో ఏకంగా వీరి వ్యక్తిగత జీవితానికి డ్యామేజ్ ఏర్పడింది. సిరి శ్రీహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నారు.
వీరిద్దరూ ఆ విషయం గురించి మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో చాలా చనువుగా ఉండడం చేత వీరి గురించి పెద్ద ఎత్తున నెగిటివిటీ ఏర్పడింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పగా శ్రీహన్ సైతం సిరికి బ్రేకప్ చెప్తాడని అందరూ భావించారు.అయితే వీరిద్దరూ కొన్ని రోజులు పాటు యెడ మొహం పెడ మొహంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోయారు. ఈ విధంగా సిరి శ్రీహన్ యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
Siri ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ సిరి…
ఇకపోతే వీరిద్దరూ కలిసి బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. సిరి శ్రీహన్ ఇద్దరు కలిసి ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సిరి తన కారు కొనుక్కున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే కారు కొనే సమయంలో సిరితో పాటు శ్రీహన్ కూడా వెంటే ఉన్నారు. ఇక సిరి కారు కొన్న సందర్భంగా శ్రీహాన్ సిరి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కారు కొనడం కాదు ముందు డ్రైవింగ్ నేర్చుకో అంటూ సిరి పై శ్రీహాన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే కారు కొనుగోలు చేసిన సమయంలో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.