Siri: సిరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంటున్న శ్రీహాన్.. ఎందుకో మరి!

Akashavani

Siri: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ సిరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న చిన్న షోలలో యాంకర్ గా చేసుకుంటూ క్రమంగా సీరియల్స్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు. ఆ ఫేమ్ తోనే గతేడాది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. హౌస్ లో అడుగుపెట్టిన అనంతరం ఈ అమ్మడికి తెలుగు ప్రేక్షకులతో ఉన్న ర్యాపో అంతా ఇంతా కాదు.

హౌస్ లో ఈ అమ్మడు షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన రొమాన్స్ వ్యవహారానికి ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉన్నారు. వీరిద్దరు హౌస్ లో క్లోజ్ గా మూవ్ అవుతూ చేసిన రొమాన్స్ రచ్చ బిగ్ బాస్ ప్రియులు ఇప్పటికే మరిచిపోలేకపోతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు ఎంతో ఫ్రేమ్ ను ఫాలోయింగ్ సంపాదించుకున్న బయటకు వచ్చారు.

ప్రస్తుతం వారు సినిమాల్లో కొన్ని ఆఫర్లు పొందుతూ కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలు లా వెలుగుతున్నారు. ఇక సిరి, షణ్ముఖ్ లు భారీ స్థాయిలో హౌస్ నుంచి నెగిటివిటీ ను మూట కట్టుకొని బయటికి వచ్చారు. దాంతో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి లు తమ రిలేషన్ షిప్ కి పూర్తిగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా అదే బాట పట్టాడని ఆ మధ్య చాలా పుకార్లు వచ్చాయి.

Siri: సిరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంటున్న శ్రీహాన్.. ఎందుకో మరి!
Siri: సిరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంటున్న శ్రీహాన్.. ఎందుకో మరి!

Siri: శ్రీహన్ సిరి గురించి ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు!

ఇక వీరిద్దరూ ఈమధ్య పలు పార్టీలకు తిరుగుతూ చిల్ అవడం తో పూర్తిగా అలాంటి రూమర్లకు బ్రేక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లతో సరదాగా ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇక అందులో శ్రీహన్ వీడియో ద్వారా ఒక మెసేజ్ పంపాడు.

సిరి ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకు ఇప్పటికీ పడుతూనే ఉంది అని శ్రీహన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను ఏదైనా సాధించాలి అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పట్టించుకోదు అని తెలిపాడు.

- Advertisement -