Sita Ramam: మన తెలుగులో హీరోయిన్స్ విషయంలో ఎప్పుడూ వినిపించే మాట ఇక్కడ తెలుగమ్మాయిలకి అంతగా ఆదరణ దక్కదని. ఈషారెబ్బ, మాధవీలత, వేద..ఇలా చాలామంది ఉన్నా కూడా ఎక్కువగా ముంబై లేదా ఇతర సౌత్ భాషలలోని హీరోయిన్స్‌కి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు. అందుకే మన తెలుగమ్మాయిలు కూడా ఇదే వాపోతుంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా హీరోల విషయంలో కూడా ఇదే ట్రెండ్ మొదలైందనుకోవచ్చు. గత కొంతకాలంగా మలయాళం, కన్నడ, తమిళ నటులను బాగా తీసుకుంటున్నారు.
సి అశ్వనీదత్ నిర్మాణంలో స్వప్న దత్ నిర్మించిన మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దుల్కర్ కి ఇక్కడ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. దాంతో సమంత ప్రధాన పాత్రలో అగ్ర దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ని ఎంపిక చేసుకున్నారు. మరోసారి ఇప్పుడు తెలుగులో వచ్చిన సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్‌ని తీసుకున్నారు.
Sita Ramam: మరి మేకర్స్ జండ్మెంట్ ఏంటో..?
వాస్తవంగా ఆ పాత్రకి నాని లేదా శర్వానంద్ లాంటి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలు తెలుగులోనే ఉన్నారు. మంచు మనోజ్ ఉన్నారు..సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్..అఖిల్..ఇలా మన దగ్గరే ఆ పాత్ర చేయగలిగే వారున్నారు. అయినా ఎందుకో మేకర్స్ మలయాళం నుంచి తీసుకున్నారు. దీనికి కారణం ఒకటే అని చెప్పుకుంటున్నారు. మలయాళం వారు రెమ్యునరేషన్ కాస్త తక్కువగా తీసుకుంటారు అని. అదీకాక వారు ఇక్కడ చేసే సినిమా అంటే క్రేజ్ కోసం డిమాండ్ చేయరని టాక్ వినిపిస్తోంది. ఈ స్వార్థం తోనే తెలుగు హీరోలను కాకుండా మలయాళ నటుడిని తీసుకున్నారట. మరి మేకర్స్ జండ్మెంట్ ఏంటో తెలియదు గాని నెటిజన్స్ దీనిపై బాగానే చర్చించుకుంటున్నారు.