Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని వారసురాలైన సితార ఆ ఇంటి పేరు ప్రతిష్టలు పెంచుతూ మహేష్ బాబు గర్వపడేలా చేస్తోంది. చిన్ననాటి నుండి సితార చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్ గా ఉంటూ అతి చిన్న వయసులోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్లాసికల్, వెస్ట్రన్ అని తేడా లేకుండా అద్భుతమైన తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఫోటోలను ప్రఖ్యాత టైం స్క్వేర్ పై ప్రదర్శించారు. దీంతో తన కూతురి పట్ల మహేష్ బాబు కూడా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ యాడ్ కోసం సితార దాదాపు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం పీఎంజే జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సితార ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో మొదటిసారిగా సితార రెమ్యునరేషన్ గురించి స్పందించింది.
Sitara: తండ్రి బాటలోనే తనయ…
ఈ ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ..” పీఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తాను అందుకున్న మొదటి రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంటూ తెలిపింది. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకొని గ్రామస్తుల బాగోగులు చూసుకోవటమే కాకుండా..ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందిస్తూ మహేష్ బాబు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక ప్రస్తుతం సితార కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సహాయ కార్యక్రమాలు చేయటంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు సితారపై ప్రశంశలు కురిపిస్తున్నారు.