Sitara: ఘట్టమనేని వారసురాలు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరు ఇప్పుడు మరుమోగిపోతోంది. చిన్న వయసులోనే సితార తన టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో సితార షేర్ చేసి పోస్టులు నిమిషాలలోనే వైరల్ అవుతూ ఉంటాయి. అంతలా సితారకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా సితార షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల జూలై 20వ తేదీ సితార తన పుట్టినరోజు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాదితో సితార పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
సితార ఈ ఏడాది తన పుట్టినరోజుని మహేష్ బాబు ఫౌండేషన్‌లోని విద్యార్థులతో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు స్వస్థలమైన బుర్రిపాలం గ్రామంలోని ఉన్నత పాఠశాలలోని 40 మంది విద్యార్థునిలకు సైకిళ్లను కూడా అందజేసి తన మంచి మనసు చాటుకుంది. మహేష్ బాబు ఫౌండేషన్‌లో కేక్ కట్ చేసిన అనంతరం పిల్లలతో ఫొటోస్ దిగి సరదాగా కాసేపు గడిపింది. ఆ తర్వాత సాయంత్రం తన ఫ్యామీలి, ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా పార్టీ చేసుకుంది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియోని సితార సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Sitara: మహేష్ ఫౌండేషన్ లో పుట్టినరోజు వేడుకలు…
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సితారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన మంచి పనికి ప్రశంశలు కనిపిస్తున్నారు. తండ్రి లాగే సితార కూడా ఇతరులకు సహాయపడుతూ తన మంచి మనసు చాటుకుంటుంది అంటూ ఆమె మీద పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సితార
పిఎంజే జువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ యాడ్ కి సంబంధించిన వీడియో కూడా విడుదల అయింది.
View this post on Instagram