Sitaramam: ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో పలు యాడ్స్ ద్వారా ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఇలా ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో ఒదిగిపోయిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా మృనాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోవడం కోసం కష్టపడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించాల్సింది మృణాల్ కాదని ,ఈ పాత్రలో నటించే అవకాశం ముందుగా వేరే హీరోయిన్ కి రావడంతో ఆమె తిరస్కరించడంతో ఆ స్థానంలోకి మృణాల్ వచ్చిందని తెలుస్తుంది. మరి ఈ సినిమాని వదులుకున్న ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..
Sitaramam:చీరలు కట్టుకుంటే ఎవరు చూస్తారు…
సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ముందుగా పూజా హెగ్డేకు వచ్చిందట. ఈ సినిమా అవకాశం రావడంతో అప్పటికే ఈమె రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. తనకు కాల్ షీట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసినప్పటికీ ఇలా చీరలు కట్టుకొని నటించే పాత్రలో తనని ఎవరు చూస్తారు అంటూ ఈమె సున్నితంగా ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఈ విధంగా పూజ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశాన్ని అందుకున్న మృణాల్ తన కెరీర్ ను ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి.