Sneha Reddy: సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సెలెబ్రెటీలు ఆ హీరోల ఇమేజ్ కి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోల భార్యలు మాత్రం వారి భర్తలు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వారి వ్యవహార శైలిలో మాత్రం మార్పు ఉండదు. మన ఎదుగుదల బట్టి మన స్థాయి హోదా కూడా మారుతూ ఉంటాయి. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా తన భర్త ఇమేజ్ కి అనుగుణంగా నడుచుకుంటున్నారు.అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో అల్లు స్నేహ రెడ్డి చాలా పద్ధతిగా మంచి వస్త్రధారణ ధరిస్తూ ఉండేవారు.
ఎప్పుడైతే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారో ఈమె వ్యవహార శైలిలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.పొట్టి పొట్టి దుస్తులు ధరించడం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లు చేయడం చేస్తున్నారు. ఇలా అల్లు స్నేహారెడ్డి భారీగా గ్లామర్ షో చేయటంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో స్నేహ రెడ్డి వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. ఇక అల్లు అర్జున్ మాదిరిగానే రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్స్ అనే ట్యాగ్ కూడా తగిలించుకున్నారు.
Sneha Reddy: ఈ మార్పు అవసరమా…
ఇలా ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్స్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ వీరి భార్యలు మాత్రం అలాగే ఉన్నారని తెలుస్తోంది. ఉపాసన తన భర్త రామ్ చరణ్ మంచి గుర్తింపు పొందినప్పటికీ ఈమెలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా దేశం మారినా కూడా తన వ్యవహార శైలి మార్చుకోకుండా ఒంటినిండా దుస్తులు ధరిస్తూ తన భర్త గౌరవ ప్రతిష్టలను కాపాడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సైతం అలాగే వ్యవహరిస్తున్నారు ఇక ఈమె సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలా స్టార్ హీరోలు భార్యలుగా లక్ష్మీ ప్రణతి ఉపాసన అలాగే ఉన్నప్పటికీ స్నేహ రెడ్డి మాత్రం పూర్తిగా మారిపోయారు ఈ మార్పు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.