Sneha తెలుగు, తమిళం తదితర భాషలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ స్నేహ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి స్నేహ మొదటగా తెలుగులో 2001 వ సంవత్సరంలో ప్రముఖ యాక్షన్ హీరో గోపీచంద్ హెరోగా నటించిన తొలి వలపు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన సినీ కేరుయార్ ని ఆరంభించింది.
ఆ తర్వాత తరుణ్ హీరో గా నటించిన ప్రియమైన నీకు అనే చిత్రం లో హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో నటి స్నేహ కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ క్రమంలో తెలుగుతో పాటూ తమిళ, మలయాళ భాషలలొ కూడా వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో అతి తక్కఉవా సమయంలోనే నటి స్నేహ స్టార్ హీరోయిన్ రేజ్ అందుకుంది. దాంతో తెలుగులో నటి స్నేహ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, వంటి స్టార్ హీరోల సరసన జతకట్టి ప్రేక్షకులను బాగానే అలరించింది.
అయితే నటి స్నేహ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. దీంతో తాజాగా నటి స్నేహ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రముఖ ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొన్న టువంటి ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు అంతేకాకుండా ఈ అమ్మడి అందానికి ఫిదా అవుతూ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నటి స్నేహ గ్లామర్ మాత్రం అస్సలు తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో నటి స్నేహ కొంతమేర బరువు పెరిగినట్లు తెలుస్తోంది దీంతో ఈ విషయం తెలుసుకున్న నటి స్నేహ బరువు తగ్గేందుకు బాగానే కష్టపడుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా నటి స్నేహ ఆమధ్య తెలుగులో వినయ విధేయ రామా అనే చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ నటి స్నేహ తెలుగులో నటించడం లేదు. ఇటీవలే నటి స్నేహ తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.