Sonal Chauhan : పింక్ బికినీ లో మతి పోగొడుతున్న బాలయ్య హీరోయిన్… వామ్మో ఇంత ఘాటుగా..?

Joythi R

Sonal Chauhan : తెలుగులో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ చిత్రంలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మతి పోగొట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి సౌతిండియా సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు లెజెండ్ చిత్రంలో తన ప్రతిభను నిరూపించుకోవడంతో వరుసగా బాలయ్య బాబు చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడికి అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన సినిమా కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ బ్యూటీ సరైన హిట్ ని అందుకోలేకపోయింది. దీంతో తనకంటూ చెప్పుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు కూడా లేదు. దీనికితోడు ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి సారిస్తోంది. దీంతో నిలకడ లేని కారణం కూడా ఈ అమ్మడి కెరియర్ ఫెయిల్యూర్ కి కారణం అయింది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సోనాల్ చౌహాన్ సినిమా ఆఫర్ల కోసం బాగానే శ్రమిస్తోంది. దీంతో అప్పుడప్పుడు ఈ అమ్మడు ఫోటో షూట్లలో పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి మతి పోగొడుతోంది. కాగా తాజాగా ఈ అమ్మడు సముద్రపు ఒడ్డున పింక్ కలర్ బికిని దుస్తులు ధరించి ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసింది. ఇంకేముంది ఒక్కసారిగా ఈ బోల్డ్ బ్యూటీ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే హాట్ సమ్మర్ లో సోనాల్ చౌహాన్ బికినీలో ఫోటోలను షేర్ చేస్తూ మరింత హీట్ పెంచుతుందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఈ మధ్యకాలంలో నటి సోనాల్ చౌహాన్ సినిమా ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచిందని కూడా అంటున్నారు.

Sonal Chauhan : పింక్ బికినీ లో మతి పోగొడుతున్న బాలయ్య హీరోయిన్... వామ్మో ఇంత ఘాటుగా..?
Sonal Chauhan : పింక్ బికినీ లో మతి పోగొడుతున్న బాలయ్య హీరోయిన్… వామ్మో ఇంత ఘాటుగా..?

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లో ది పవర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్-3 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ చిత్రమైనా ఈ హాట్ బ్యూటీ కి సినిమా ఆఫర్లు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

- Advertisement -