Sonia Agarwal ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోయిన్లు తమ పెళ్లి విషయంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల కారణంగా సినీ కెరీర్ ని పోగొట్టుకున్నప్పటికీ విడాకుల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే రాణిస్తున్నారు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7/జి బృందావన్ కాలనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించిన సోనియా అగర్వాల్ కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి సోనియా అగర్వాల్ 7/జి బృందావన్ కాలనీ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రంలో నటించిన తర్వాత నటి సోనియా అగర్వాల్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ అమ్మడు 7/జి బృందావన్ కాలనీ చిత్ర షూటింగ్ సమయంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది. దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెళ్లయిన రెండు సంవత్సరాలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు దీంతో అప్పటినుంచి నటి సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోలేదు.
అయితే ఈ మధ్య కాలంలో నటి సోనియా అగర్వాల్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికే ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ లోపించడంతో కొంతమేర బరువు పెరిగి లావుగా తయారయ్యింది. అయినప్పటికీ సోనియా అగర్వాల్ జిమ్ వర్క్ ఔట్లు అలాగే ఆహారపు ఫిట్నెస్ విషయం వంటి వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మళ్లీ బరువు తగ్గింది. కాగా నటి సోనియా అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు ఒకసారి చూసినట్లయితే ఈ అమ్మడు మళ్ళీ హీరోయిన్ గా రాణించేందుకు పెట్టిన డెడికేషన్ తెలుస్తుంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సోనియా అగర్వాల్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా తాజాగా నటి సోనియా అగర్వాల్ గ్రీన్ కలర్ దుస్తులు ధరించి కొంతమేర చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలో చూసినటువంటి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా నటి సోనియా అగర్వాల్ మళ్లీ గట్టిగా ప్రయత్నిస్తే హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి సోనియా అగర్వాల్ తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న గ్రాండ్ మా అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం హార్రర్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. మరి సోనియా అగర్వాల్ గతంలో మాదిరిగా మళ్లీ ఆఫర్లు దక్కించుకుని మళ్లీ బిజీబిజీగా రాణిస్తుందో లేదో చూడాలి.