Kalpika Ganesh : యశోద సినిమాలో కీలక పాత్రలో నటించిన కల్పిక గణేశ్.. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటుంది. ఏదోక కాంట్రవర్సీతో ఎప్పుడూ మీడియాతో ఉంటూ ఉంటుంది. తాజాగా కల్పిక గణేశ్ మరో వివాదంలో చిక్కుకుంది. పిలవని ఫంక్షన్‌కి కూడా కల్పిక గణేశ్ తాజాగా వెళ్లింది. ఓ అవార్డు ఫంక్షన్‌కి ఆమెను ఆహ్వానించపోయినా వెళ్లింది.
స్వయంగా స్టేజ్‌పైకి ఎక్కి మరీ ఈ విషయాన్ని కల్పిక గణేష్ తెలిపింది. తనను అవార్డు ఫంక్షన్‌కి పిలవలేదని, అయినా వచ్చానంటూ మైకు తీసుకుని మరీ చెప్పుకొచ్చింది. అయితే పిలకపోయినా ఎందుకు వెళ్లాననే విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను ఇండస్ట్రీని ఇల్లుగా భావిస్తానని, అందుకే పిలకపోయినా వచ్చానంటూ కల్పిక గణేశ్ చెప్పుకొచ్చింది. తనను ఎవరూ పిలవలేదని, ఏ మొహమాటం లేకుండా వచ్చానని తెలిపింది.
ట్రోల్స్ గురించి తాను పట్టించుకోనని, మనం చేసినా అవి చేస్తూనే ఉంటారని స్పష్టం చేసింది. జనాలకు నిజాలు ఏంటో తెలియాలని. అందుకే చాలమాంది నిజసర్వరూపాలను బయటపెడుతున్నానని కల్పిన గణేశ్ తెలిపింది. సుచీలిక్స్ ఊరికే బయటకు రాలేదని, ఇంకా చాలామంది బండారాలు బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్మయి చాలా ఫైట్ చేసిందని, ఆమెను క్లోజ్ చేశారని తెలిపింది.
Kalpika Ganesh :
ధనుష్, ధన్య బాలకృష్ణ, అనిరుధ్, బాలాజీ మోహన్ లాంటి చాలామంది గుట్టు త్వరలో బయటపెడతానంటూ కల్పన సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఈ సంవత్సరంలో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపింది. ఇంకా కొందరి గురించి నిజాలు బయటపెట్టాల్సి ఉందని చెప్పుకొచ్చింది. దీంతో కల్పనా గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతోన్నాయి. ఆమె ఎలాంటి విషయాలు బయటపెడతారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇండస్గ్రీలో మొత్తం దీనికి గురించే చర్చ నడుస్తోంది.