Soumya Rao: బుల్లితెరపై ప్రసరమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా యాంకర్లుగా అనసూయ, రష్మీ ఎంత అలా సందడి చేశారో చూశాం. ప్రస్తుతం అనసూయ మాత్రం జబర్దస్త్ కు దూరమైన సంగతి తెలిసిందే.
అంతకుముందే సుడిగాలి సుధీర్ కూడా ఈ షో నుండి అవుట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైపర్ ఆది కూడా బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. మామూలుగా హైపర్ ఆదికి జబర్దస్త్ లో ఎంత క్రేజ్ ఉందో చూసాం. చాలామంది ప్రేక్షకులు ఈయన కోసం చూస్తూ ఉంటారు. అలాంటిది ఈయన బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. తను బయటికి రావడానికి కూడా కారణం యాంకర్ సౌమ్యరావు అని తెలుస్తుంది.
గత కొన్ని రోజుల నుండి బుల్లితెర ఆర్టిస్ట్ సౌమ్యరావు జబర్దస్త్ లో యాంకర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీరియల్స్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ రావటంతో జబర్దస్త్ లో కూడా యాంకర్ గా అడుగుపెట్టింది. అయితే హైపర్ ఆది ఎవరైనా కొత్తగా అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్లపై బాగా డబల్ మీనింగ్ డైలాగులు కొడుతూ ఉంటాడు. సౌమ్య పై మొదట్లో చాలా డబల్ మీనింగ్ డైలాగులు వేశాడు.
Soumya Rao:
దీంతో వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం కూడా జరిగినట్లు తెలిసింది. అయితే సౌమ్య వల్లే తను ఆ షో నుండి బయటికి వచ్చాను అని తాజాగా తెలిపాడు హైపర్ ఆది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో యాంకర్ రష్మీ హైపర్ ఆదిని.. మీరు జబర్దస్త్ నుండి బయటికి రావటానికి ఈ ముగ్గురిలో ఎవరు కారణం అంటూ సౌమ్యరావుతో పాటు ఇద్దరు ఫోటోలను స్క్రీన్ పై పెట్టగా వెంటనే హైపర్ ఆది ఆ అమ్మాయి వల్లనే అంటూ సౌమ్యరావు వైపు చూయించాడు. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది.