Soundarya : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అతికొద్ది సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు హోదా దక్కించుకున్నటువంటి నటీనటులలో ప్రముఖ నటి సౌందర్య ఒకరు. అయితే నటి సౌందర్య సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే 100 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, అలాగే మరింతమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ దురదృష్టవశాత్తు నటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించింది.
అప్పట్లో నటి సౌందర్య కారణంగా కొంతమంది ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోయిన్లకు అవకాశాలు తక్కువ అయ్యాయి. దీనికితోడు సౌందర్య హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవుతుందని అంతో దర్శకనిర్మాతలు కూడా సౌందర్య ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ క్రమంలో పలు తెలుగు తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ కి కూడా నటి సౌందర్య కారణంగా అవకాశాల విషయంలో కొంత మేర భంగపాటు కలిగిందని అప్పట్లో కొన్ని వార్తలు బలంగా వినిపించాయి. ఇందులో ముఖ్యంగా కొంతమందైతే ఏకంగా నటి సౌందర్య కారణంగా స్నేహా చేతికందిన ఆఫర్లు కూడా చేజారిపోయాయని కానీ సౌందర్య మరణం తర్వాత స్నేహ సినీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుందని కొందరు చర్చించుకుంటున్నారు.

దీంతో తాజాగా ఈ విషయంపై నటి స్నేహ స్పందించింది. ఇందులో భాగంగా నటి సౌందర్యని గాఢంగా అభిమానించే వాళ్ళలో తాను కూడా ఒకరని తెలిపింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒకరి వల్ల అవకాశాలు రావడం అలాగే చేజారిపోవడం వంటివి జరగవని కేవలం మనలో ఉన్నటువంటి ప్రతిభ మరియు పరిస్థితుల కారణంగానే ఆఫర్లు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో నటి స్నేహ కి మరియు సౌందర్య కి మధ్య విభేదాలు ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలకు పులిస్టాఫ్ పడింది. అలాగే కొందరు స్నేహ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ అవగాహన లేనటువంటి కొంతమంది ఇలా ఇలా బ్రతికున్న వారికి మరియు చనిపోయిన వారికి మధ్య పుల్లల పెడుతున్నారని ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి స్నేహ దాదాపుగా 80 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ మధ్యకాలంలో నటి స్నేహ కి హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే రాణిస్తోంది. కాగా ప్రస్తుతం నటి స్నేహ తన భర్త ప్రసన్న మరియు ఇద్దరు పిల్లలతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.