Sowmya Rao: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సౌమ్యరావు ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా పరిచయం అవ్వడం కంటే ముందుగానే పలు సీరియల్స్ లో నటించి సందడి చేశారు. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌమ్యరావు ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. మదర్స్ డే సందర్భంగా సౌమ్యరావు సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుంటూ చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సౌమ్యరావు తల్లి క్యాన్సర్ తో మృతి చెందడంతో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా తన తల్లి చివరి రోజులలో పడిన బాధను వర్ణిస్తూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ సందర్భంగా సౌమ్యరావు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. అమ్మ, అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్మెంట్, మందులు బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అమ్మ కోసం మొక్కని దేవుడు లేదు,చేయని పూజలు లేవు ఎన్నో ఉపవాసాలు చేశాను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము కానీ చివరికి అమ్మను దక్కించుకోలేకపోయాను.మదర్స్ డే రోజు అందరూ అమ్మ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ మదర్స్ డే అని శుభాకాంక్షలు చెబుతున్నారు.
Sowmya Rao: నువ్వు లేని జీవితం అసంపూర్ణం…
నాకు మాత్రం నువ్వు చివరి రోజులలో పడిన బాధ, గుర్తుకు వస్తుంది అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి ఎన్ని పూజలు చేసినా.. అవన్ని వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం. ప్రతిరోజు ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను.అమ్మ నువ్వు నాకోసం మళ్లీ పుడతావని ఎదురుచూస్తున్నాను దేవుడా ప్లీజ్ మా అమ్మ నాన్నలను తిరిగి నాకు ఇవ్వు.. హ్యాపీ మదర్స్ డే అమ్మ ఆల్వేస్ మిస్సింగ్ యు.. మిస్ యు సో మచ్ అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
View this post on Instagram