Sree Mukhi: కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరో చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీముఖి. అనంతరం అదుర్స్ కార్యక్రమం ద్వారా బుల్లి తెరకు పరిచయమైన ఈమె పటాస్ కార్యక్రమంతో యాంకర్ గా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం మంచి విజయం కావడంతో శ్రీముఖి బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అవకాశం లభించింది. శ్రీముఖి తన మాట తీరుతో అల్లరి చేష్టలతో ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణాన్ని నెలకొల్పుతుంది. అందుకే ఈమె యాంకర్ గా వ్యవహరించిన కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.
ఇకపోతేబుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంట్రీఇచ్చారు. బిగ్ బాస్ కార్యక్రమంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్ బాస్ తర్వాత ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా ఏవైనా స్పెషల్ ఈవెంట్ లో కూడా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇలా బుల్లితెర రాములమ్మ ప్రేక్షకులను సందడి చేస్తున్న శ్రీముఖి ఒకరోజుకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sree Mukhi: వెండితెరపై సందడి చేయనున్న శ్రీముఖి…
ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న టువంటి సుమ ఒక్క రోజుకు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే శ్రీముఖి మాత్రం ఒక రోజు కాల్షీట్ కోసం ఏకంగా మూడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. యాంకర్ సుమ తర్వాత ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ శ్రీముఖి వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.ఈ విధంగా శ్రీముఖి ఒక రోజుకు 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలకు అదేవిధంగా మరోవైపు పలు సినిమాల్లో కూడా నటిస్తూ శ్రీముఖి ఎంతో బిజీగా ఉన్నారు.