Sree Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ శ్రీ రెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదాన్ని తట్టిలేపి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. డబల్ మీనింగ్ డైలాగులతో బోల్డ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఏదో విధంగా శ్రీ రెడ్డి అడపాదడపా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది.
ఇక శ్రీరెడ్డి కొంతకాలం నుంచి యూట్యూబ్ లో శ్రీరెడ్డి అఫీషియల్ అనే ఖాతా తెరిచి అందులో రకరకాల వంటలు పల్లెటూరి పద్ధతిలో చేస్తూ.. ఈ క్రమంలోనే కొంత బోల్డ్ సెగ తగిలించి యూట్యూబ్ ప్రియులను మరో లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా అదే క్రమంలో శ్రీరెడ్డి పంచుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో శ్రీ రెడ్డి ఒక నది ఒడ్డున రెండు పెద్ద పెద్ద పీత లను పట్టుకుని వంట చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో శ్రీరెడ్డి ఒక చమత్కారం కూడా చేసింది. ‘మొన్నటి వీడియోలో తలుపులు తెరిచి ఉంచినందుకు ( పైట కప్పుకొనందుకు ) మా బావ గుడిసేలోకి తీసుకెళ్ళి చితకొట్టేశాడు అండీ బాబూ.. ‘ అంటూ మొర పెట్టుకుంది. ఆ తర్వాత పీతలను శుభ్రంగా కడిగి కోసి ఒక కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుంది.

Sree Reddy: శ్రీ రెడ్డికి భోజనం దీంట్లో పెట్టుకొని తినడం అంటే ఇష్టమట!
ఇక పీతల కూర గాను కావాల్సిన మసాలా దినుసుల గ్యాలరీని ఏర్పాటు చేసుకుంది. మొత్తానికి నెటిజన్ల కు ముచ్చట చెప్పుకుంటూ ఆ పీతల కూర వంట పూర్తి చేసింది. అనంతరం శ్రీ రెడ్డి ఒక అరిటాకులో భోజనం పెట్టుకొని చూసేవారికి నోరు ఊరేలా తినడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా నాకు అరిటాకు భోజనం అంటే చాలా ఇష్టం అని వెల్లడించింది.
ప్రస్తుతం శ్రీరెడ్డి కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో పంచుకొని వన్ అవర్ పూర్తికాగా యూట్యూబ్ లో ఒక రేంజ్ లో సందడి చేస్తుంది. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కేయ్యండి.