Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారని త్వరలోనే మూడో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ విషయంపై మెగా కుటుంబం ఏ మాత్రం స్పందించి ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.ఇకపోతే తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ కనుక చూస్తుంటే ఈమె మూడో పెళ్లికి సిద్ధమైందని అర్థమవుతుంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీజ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ఎన్నో అనుమానాలకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా శ్రీజ స్పందిస్తూ…కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈమె గత ఏడాది జరిగిన కొన్ని అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
Sreeja Konidela: శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందా…
డియర్ 2022… నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు… నా గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి.. నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటూ కష్టసుఖాలలో నా తోడు ఉంటూ నన్ను సపోర్ట్ చేసే వ్యక్తిని కలుసుకోవడం నిజంగా నా అదృష్టం.త్వరలోనే కొత్త ప్రయాణం మొదలవుతుంది అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ విధంగా శ్రీజ కొత్త జీవితం ప్రారంభిస్తున్న అంటూ చేసినటువంటి ఈ పోస్ట్ చూస్తూ ఎంతోమంది అభిమానులు ఈమె మూడో పెళ్లికి సిద్ధమైందా? అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా? ఇంతకీ శ్రీజ చేసుకోబోయే వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.