Sreeja Konidela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మెగా హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
శ్రీజ కాలేజీ చదువుతున్న రోజుల్లోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి ప్రేమలో పడి ఇంట్లో వారికి చెప్పకుండా తనతోపాటు ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమె తన తండ్రికి తన బాబాయిలకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే కొంతకాలం తర్వాత తన భర్త శిరీష్ భరద్వాజ్ తో మనస్పర్ధలు రావడంతో శ్రీజ తనకు విడాకులు ఇచ్చి తన బిడ్డతో సహా చిరంజీవి ఇంటికి వచ్చారు.ఇలా కూతురితో కలిసి తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నటువంటి శ్రీజకు చిరంజీవి మరొక వివాహం చేశారు. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి శ్రీజవైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు ఇక ఈ దంపతులకు మరొక కుమార్తె జన్మించారు.

Sreeja Konidela: అందుకే ప్లేట్స్ పగలగొట్టారా…
శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయని వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయారని అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు తెలియజేయలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచే శ్రీజ తాజాగా ముంబై రెస్టారెంట్ తో తన స్నేహితులతో కలిసి ఏకంగా ప్లేట్స్ అన్నింటిని పగలగొడుతూ కనిపించారు. ముంబైలోని గ్రీక్ హోటల్లో గ్రీక్ సాంప్రదాయం ప్రకారం ప్లేట్స్ పగలగొట్టడం వల్ల అంత శుభం కలుగుతుందని నమ్మకం .దాంతో అక్కడికి వెళ్ళిన వారు ఇలా ప్లేట్స్ పగలగొడుతూ ఉంటారు. దీంతో శ్రీజ కూడా ప్లేట్స్ పగలగొడుతున్నటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.