Sreeja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి అందరికీ తెలిసిందే. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అంచలంచలుగా ఎదిగిన చిరంజీవి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా మెగా వారసులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. చిరంజీవికి తన కుటుంబం అంటే అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అంతే కాకుండా కష్టంలో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకోవడంలో కూడా చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. ఇలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి ఒకరి విషయంలో మాత్రం బాధపడుతూనే ఉన్నాడు.
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ.ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోయినా కూడా విడాకుల వార్తల వల్ల బాగా పాపులర్ అయ్యింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ ఒక బిడ్డ పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్ధలు రావడంతో తిరిగి మెగా గూటికి చేరింది. మోసం చేసి ఇంటి నుండి పారిపోయిన చిన్న కుమార్తెను చిరంజీవి ఎంతో ప్రేమగా ఆదరించాడు. ఆ తర్వాత కూతురు భవిష్యత్తు బాగుండాలని తానే ఒక మంచి వ్యక్తిని చూసి అంగరంగ వైభవంగా రెండవపెళ్లి జరిపించాడు. అయితే రెండవ భర్త తో కూడా శ్రీజకి మనస్పర్ధలు రావటంతో ప్రస్తుతం అతనికి కూడా దూరంగా పుట్టింట్లోనే ఉండిపోయింది.
Sreeja:కోట్ల విలువ చేసే ఆస్తులు ఇచ్చిన చిరు..
దీంతో చిరంజీవి ఇప్పటికీ తన చిన్న కూతురుతో పాటు ఇద్దరు మనవరాళ్ల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి తాను సంపాదించిన దానిలో కొంత మొత్తం చిన్న కూతురి కోసం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల శ్రీజ కోసం చిరంజీవి కోట్ల విలువ చేసే ఒక ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో గారాబంగా పెంచుతున్న కూతురు కష్టాలు పడకుండా ఉండటానికి జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో రూ. 35 కోట్ల విలువ చేసే ఇంటిని చిరంజీవి కొనుగోలు చేసి తన కూతురికి ఇచ్చినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా చిరంజీవి జీవితాంతం తన చిన్న కూతురి బాగోగులు చూసుకుంటూ ఆమె జీవితం గురించి బాధలు అనుభవించాల్సి ఉంటుంది.