Sreekanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఊహ కూడా అనేక సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది.
శ్రీకాంత్ ఊహ వివాహం చేసుకొని ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వీరికి ముగ్గురు పిల్లలు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల పర్సనల్ జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకాంత్ ఊహ గురించి కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం జరిగింది. వివాహం జరిగినప్పటినుండి ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
Sreekanth: వార్తలు రాసే వారిలో మార్పు రావాలి…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ ఈ వార్తలపై స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. మార్చి 23 శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో విడాకుల వార్తల గురించి ప్రస్తావించగా శ్రీకాంత్ స్పందిస్తూ…” ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసేస్తూ ఉంటారు. మరి దారుణంగా ఒకసారి నేను మరణించినట్లు వార్తలు రాశారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఫ్యామిలీకి తెలిస్తే వారు తట్టుకోలేరు. ఇప్పుడు వినిపిస్తున్న ఈ విడాకుల వార్తల వల్ల నా భార్య నేను ఎక్కడికైనా కలిసి వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా నా భార్యకి ఫంక్షన్స్ కి వెళ్ళటం ఇష్టం ఉండదు. ఇలాంటి వార్తలు రాకుండా ఉండాలంటే రాసేవారిలో మార్పు రావాలి” అంటూ చెప్పుకొచ్చాడు.