Sreekanth Daughter: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన శ్రీకాంత్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ హీరోయిన్ ఊహని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ ఆమె ‘ సినిమాలో వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకొని
ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమై ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక శ్రీకాంత్ తన పెద్ద కుమారుడు రోషన్ ని నిర్మలా కాన్వెంట్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇటీవల విడుదలైన పెళ్లి సందడి అనే సినిమా అదో రోషన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక శ్రీకాంత్ కూతురు మేధా కూడా అచ్చం ఊహ లాగే హీరోయిన్ ని తలపించేలా ఎంతో అందంగా ఉంది. ఇక చిన్న కుమారుడు రోహన్ కూడా అచ్చం శ్రీకాంత్ లాగే ఉంటాడు. ఇలా ముగ్గురు పిల్లలు కూడా శ్రీకాంత్, ఊహా లకు జిరాక్స్ కాపీస్ లాగా ఉంటారు .
Sreekanth Daughter: పసిడి బొమ్మలా శ్రీకాంత్ కూతురు…
ఇదిలా ఉండగా శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కుటుంబం మొత్తం ఒక ప్రైవేటు ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో శ్రీకాంత్ కుమారులు ఇద్దరు పైజామా ధరించి సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోగా… ఇక శ్రీకాంత్ కూతురు మేధా బంగారు రంగు పట్టు చీరలో అచ్చం బంగారు బొమ్మల మెరిసిపోయింది. పట్టుచీరలో శ్రీకాంత్ కూతురిని చూస్తే అతిలోకసుందరి భువికి దిగివచ్చిందా అనేటుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… మేధా అందానికి అందరూ ఫిదా అవుతున్నారు.