Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆది కేశవ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఆది కేశవ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీలీలకు అబ్బాయిల గురించి ఒక ప్రశ్న ఎదురయింది. మీకు అబ్బాయిలు ఎలా ఉంటే నచ్చుతారు ఎలాంటి అబ్బాయిలు అంటే మీకు ఇష్టం అంటూ ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీ లీల సమాధానం చెబుతూ చాలామంది ఎక్కువగా గడ్డం మీసాలు పెట్టుకొని ఉంటారు అలాంటి వారు అంటే నాకు అసలు ఏ మాత్రం నచ్చరని క్లీన్ గా షేవ్ చేసుకొని ఉండే అబ్బాయిలు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అంటూ ఈ సందర్భంగా ఈమె తనకు అబ్బాయిలు ఎలా ఉంటే నచ్చుతుందో తెలియచేశారు.
అలాంటి వాళ్ళు హ్యాండ్సమ్ గా ఉంటారు..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గడ్డం పెట్టుకుని మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది ఈమెకు గడ్డం పెంచని అబ్బాయిలు అంటేనే ఇష్టమని చెప్పడంతో ఒక్కసారిగా అబ్బాయిలందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇలా శ్రీల తనకు అబ్బాయిలు ఎలా ఉంటే ఇష్టం అనే విషయం తెలియచేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తాజాగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె త్వరలోనే ఆదికేశవ ద్వారా రాబోతున్నారు. అలాగే నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ద్వారా డిసెంబర్లో రాబోతున్నారు.జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా ఉన్నారు.