Sreeleela: శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్నటు వంటి పేర్లలో ఒకటి. నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీలీలా ప్రస్తుతం స్టార్ హీరోలు అందరి నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా తన అందం అభినయంతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దర్శక నిర్మాతలు యంగ్ హీరోలు అందరికీ ఈమె ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు. ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం 10 సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ పట్ల ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఒక క్షణం పాటు తీరిక లేకుండా వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇలా స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్నటువంటి ఈమె బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
Sreeleela: ప్రిపరేషన్ మూడ్ లోకి శ్రీ లీల…
శ్రీ లీల ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాదితో ఎంబిబిఎస్ పూర్తి అవుతుంది. ఇలా ఎంబిబిఎస్ చదువుతున్నటువంటి శ్రీ లీలకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో పరీక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈమె పరీక్షలకు ప్రిపేర్ అవడానికి రెండు నెలల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారట.ఇలా ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు శ్రీ లీల ఎలాంటి సినిమాల షూటింగ్లో పాల్గొనకుండా పూర్తిగా తన చదువుపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది.డిసెంబర్ నెలలో పరీక్షలు పూర్తి అయిన తర్వాత తిరిగి తన సినిమాల షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నట్టు తెలుస్తుంది.