Sreemukhi: ఇలా అందరికి చూపించకు.. నాకు నచ్చట్లేదు.. చున్నీ వేసుకో.. శ్రీముఖికి ఆదేశం!

Akashavani

Sreemukhi: బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఈమెకు బుల్లితెరపై పటాస్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు పెద్దఎత్తున రచ్చ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె సరిగమప, జాతి రత్నాలు వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే పలు సినిమాలలో కూడా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై పలు అవకాశాలను అందుకొని కెరీర్లో ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకొని రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు.

Sreemukhi: ఇలా అందరికి చూపించకు.. నాకు నచ్చట్లేదు.. చున్నీ వేసుకో.. శ్రీముఖికి ఆదేశం!
Sreemukhi: ఇలా అందరికి చూపించకు.. నాకు నచ్చట్లేదు.. చున్నీ వేసుకో.. శ్రీముఖికి ఆదేశం!

Sreemukhi: ఆదేశం జారీ చేసిన నెటిజన్…

ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా శ్రీముఖి ఒక డాన్స్ వీడియో చేస్తూ ఆ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు. లెహంగా మాదిరి ఉన్న డ్రెస్ ధరించిన శ్రీముఖి ఈ డ్రెస్ లో ఎంతో అద్భుతమైన మాస్ డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోల పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్ చేశారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా శ్రీముఖిని చున్ని వేసుకోవాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేశాడు.ఇలా అందరికీ చూపించకు చున్ని వేసుకో ఇంకా చాలా బాగుంటుంది అంటూ శ్రీముఖి ఫోటో పై కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -