Sreemukhi: వెండితెరపై హీరోలకు చెల్లెలు పాత్రలలోను హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోనూ నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన శ్రీముఖి వెండితెరపై పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇలా వెండితెరపై ఈమెకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో బుల్లితెరవైపు అడుగులు వేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈమె భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.
ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న శ్రీముఖి ప్రస్తుతం సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో అవకాశాలను అందుకొని కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీముఖి ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదని చెప్పాలి.ఇలా ఈమెకు పెళ్లి వయసు దాటిపోతున్నప్పటికీ పెళ్లి గురించి ఆలోచించకుండా తన దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉందని చెబుతూ వస్తున్నారు. ఇక శ్రీముఖి పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి…
శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్టు రకరకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో శ్రీముఖి స్పందిస్తూ తాను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందని వెల్లడించారు.ఇక శ్రీముఖి పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఇదే సమాధానం చెబుతున్నారు అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అచ్చం పెళ్లి కూతురుగా ముస్తాబయి కనిపించే అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నటువంటి ఫోటోలను శ్రీముఖి ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారడంతో శ్రీముఖి పెళ్లికి సిద్ధమయ్యారా అందుకే ఇలా ముస్తాబవుతూ అందరికీ హింట్ ఇచ్చారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.