Sreemukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతోకాలంగా బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి తన యాంకరింగ్ తో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షో లలో ఎక్కడ చూసినా కూడా శ్రీముఖి సందడి చేస్తోంది. అంతేకాకుండా శ్రీముఖి వరస సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇలా ఒక వైపు సినిమాలు, మరొకవైపు టీవీ షో లతో నిత్యం బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అందంతో నెటిజెన్లను ఆకట్టుకుంటుంది. ఇలా సంప్రదాయ దుస్తులతో పాటు పొట్టి పొట్టి బట్టలు ధరించి తన మేని అందాలతో రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో శ్రీముఖి శేర్ చేసిన ఫోటోలు నిమిషాలలో వైరల్ అవుతున్నాయి అంటే సోషల్ మీడియాలో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎటువంటితో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కూడా సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో పసుపు రంగు దుస్తులలో శ్రీముఖి పెళ్లికూతురులా మెరిసిపోతోంది.
Sreemukhi: అతన్నే పెళ్లి చేసుకో శ్రీముఖి…
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు శ్రీముఖి అందాలను పొగుడుతూ పెళ్లెప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం .. ఇంకెన్నాళ్లు ? అవే బోరింగ్ స్టిల్స్ … ఏంటి ? మాకు ఈ టార్చర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మరి కొంతమంది … శ్రీముఖి ఆ ఫోటోగ్రాఫర్‌నే పెళ్లి చేసుకో .. రోజంతా ఫోటోలు దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీముఖి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. మరి ఈ అమ్మడు బ్యాచ్లర్ లైఫ్ కి ఎప్పుడు గుడ్ బై చెబుతుందో చూడాలి మరి.