jacqueline గత ఏడాది బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మనీలాండరింగ్ కేసు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుఖేష్ చంద్రశేఖర్ భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో అప్పటినుంచి సుఖేష్ చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు నటీనటులతో సుఖేష్ చంద్రశేఖర్ లావాదేవీలు జరపడంతోపాటు వారికి కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. దీంతో తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహూ చిత్రంలో స్పెషల్ సాంగులో నటించి అలరించిన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ మనీలాండరింగ్ వ్యవహారంలో ఉన్నట్లు తెలిసింది.
దీంతో అప్పటినుంచి నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ తరచుగా పోలీసుల విచారణకు హాజరవుతోంది. అయితే తాజాగా ఢిల్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి విచారణకు హాజరు కమ్మని ఈ అమ్మడికి సమన్లు అందాయి. దీంతో నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ స్పందించకుండా వెళ్ళిపోయింది. దీంతో నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే జాక్వలిన్ ఫెర్నాండెజ్ విచారణలో ఏం జరిగిందని విషయాలు పై స్పందించాలని లేకపోతే లేనిపోని అనుమానాలు, పుకార్లు మొదలవుతాయని కాబట్టి ఈ విచారణ గురించి స్పందించాలని అభిమానులు కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సుఖేశ్ చంద్రశేఖర్ దేశంలోని పలువురు ప్రముఖులతో పరిచయాలు చేసుకుని పెద్ద మొత్తంలో లాభాలు చూపిస్తానని ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా మనీలాండరింగ్ పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమంలోని ప్రముఖులైన జాక్వలిన్ ఫెర్నాండెజ్ మరియు ప్రముఖ స్పెషల్ సాంగ్ యాక్టర్ నోరా ఫతేహి అలాగే మరింతమంది నటీనటులతో సుఖేష్ చంద్రశేఖర్ కి ఆర్థిక లావాదేవీల సంబంధాలతోపాటు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు పైగా విలువ చేసే బెంజ్ కార్లను గిఫ్ట్ గా కూడా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.