Sri Leela: టాలీవుడ్‌కు ఎంతోమంది హీరోయిన్లు వచ్చి ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేస్తున్నారు. టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయితే హీరోయిన్లకు స్టార్ డమ్ కొన్నిరోజుల పాటే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువగా సినిమా అవకాశాలు రావు.
తాజగా యంగ్ హీరో శ్రీలీలాకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మాస్ మహారాజ్ రవితేజ్ హీరోగా వచ్చిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీలీలా కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆమెకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు, నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు వెంటపడుతున్నారు. దీంతో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.
Sri Leela:
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలా. ఆ తర్వాత ఇప్పుడు ధమాకా సినిమాలో తన ఫెర్పామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ నటిస్తున్న సిననిమాలో నటిస్తోంది. ఇక యంగ్ హీరో నితిన్ తో కూడా శ్రీలీలా మరో సినిమా చేస్తోంది. దీంతో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. మరోవైపు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తోన్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. రూ.కోటి పైమాటే రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తోన్నట్లు చెబుతున్నారు. 2019లో కన్నడలో కిస్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి శ్రీలీల అడుగుపెట్టింది.