Sri Reddy బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి. టాలీవుడ్ లో చాలా మందిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోవడం ఈ భామకు సరదా. తనను అవకాశాల పేరుతో లైంగికంగా వాడుకున్నారంటూ బడాబాబుల పేర్లు బయట పెడుతూ రచ్చ రచ్చ చేసింది. ఒకానొక టైంలో సంచలన కామెంట్స్ తో ఆ బడాబాబులకు నిద్రపట్టకుండా చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా రూటు మార్చేసింది. ఇపుడు ఎవరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఈ బ్యూటీని బాగా గమనిస్తున్న నెటిజన్లు..శ్రీరెడ్డి ఇపుడు పాత రూటను మార్చి ఏదో కొత్త మాస్టర్ ప్లానే వేసినట్టుందని తెగ చర్చించుకునేలా చేస్తోంది.
టాలీవుడ్ ఎలాగైనా మంచి పొజిషన్‌కు వెళ్లాలన్నది శ్రీరెడ్డి హైదరాబాద్‌లో ఎంటరైనపుడు పెట్టుకున్న లక్ష్యం. అందులో భాగంగానే తొలుత హైదరాబాద్‌లోని ఓ తెలుగు న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రంజెటర్ గా అవకాశం సంపాదించింది. ఆ తర్వాత శ్రీరెడ్డి అందంగా ఉంటుందని, హీరోయిన్ అయితే బాగుంటుందని ఫాలోవర్లు, మూవీ లవర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో..అప్పట్లోనే ఆ దిశగా అడుగులు వేస్తూ టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే మధ్యలో మా అసోసియేషన్ ముందు అర్థనగ్నంగా నిలబడి రచ్చ చేయడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడ్డది. మళ్లీ చాన్నాళ్లకు శ్రీరెడ్డికి తన పాత లక్ష్యాలు గుర్తొచ్చినట్టున్నాయి. కొంతకాలంగా కాంట్రవర్సియల్ కామెంట్స్ ను తగ్గించి..కేవలం గ్లామర్ షోపై మాత్రమే ఫోకస్ పెట్టింది. ట్రెడిషనల్ శారీలు వేసుకుంటూ వంటలక్కగా మారిపోయింది. స్పైసీ స్పైసీ వంటకాలు చేస్తూ..

మరోవైపు ఎద అందాలు చూపిస్తూ..తనలోని ఒరిజనల్ యాంగిల్‌ను మరోసారి అందరికీ పరిచయం చేసే పనిలో పడ్డట్టు తెలిసిపోతుంది. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే సిల్వర్ స్క్రీన్‌పై టాలెంట్ ఏంటో చూపిస్తానని బోల్డ్, హాట్ ఫొటోషూట్‌తో చెప్పకనే చెబుతోంది. చాలా కాలం తర్వాత శ్రీరెడ్డి ఇలా యూటర్న్ తీసుకోవడంతో..రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి స్టిల్స్ తో దర్శనమిస్తుందోనని తెగ ఆలోచిస్తున్నారు నెటిజన్లు.