Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్టింగ్ కౌచ్ సమయంలో శ్రీ రెడ్డి వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. అప్పటినుంచి బోల్డ్ బ్యూటీగా పేరు పొందిన ఈమె నిత్యం ఏదో ఒక విషయం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈమె తనకు సంబంధం లేని విషయాలు అన్నింటిలో కూడా కల్పించుకుని ఆ విషయంలో ఎవరిది తప్పు ఉంటే వారిని తన బూతులతో కడిగి పడేస్తారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో వంట వీడియోల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే, నటుడు ఉదయనిది స్టాలిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ గతంలో తనతో కలిసి ఒకరోజు రాత్రంతా బెడ్ షేర్ చేసుకున్నారని ఈమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమిళ నటుడు విశాల్ రెడ్డి ద్వారా తనకు ఉదయనిధి స్టాలిన్ పరిచయం అయ్యారని శ్రీ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే గతంలో ఇదు కడిర్వేలన్ సినిమా షూటింగ్ సమయంలో ఉదయనిధి స్టాలిన్ తనని పార్క్ హయత్ హోటల్లో కలుసుకున్నారని శ్రీ రెడ్డి వెల్లడించారు.
Sri Reddy: అవకాశం ఇస్తానని చెప్పారు…
ఆ రోజు రాత్రంతా హోటల్లోనే గడిపానని, ఆరోజు ఉదయ్ నాతో బెడ్ షేర్ చేసుకున్నారని,తన పని పూర్తయ్యాక తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఉదయనిది స్టాలిన్ చెప్పినట్లు శ్రీరెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు తనకు ఎలాంటి అవకాశాలు ఇప్పించలేదని శ్రీరెడ్డి తెలియజేశారు. ఇక తాను తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు కూడా తను చాలా సంతోషించానని శ్రీ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనేశ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇంకా ఎంతమంది హీరోలు నీ లిస్ట్ లో ఉన్నారేంటి శ్రీరెడ్డి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా శ్రీ రెడ్డి ఉదయ నిధి స్టాలిన్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ విషయంపై హీరో ఏ విధంగానూ స్పందించలేదు.