Sree Reddy: గోవాలో ఎన్టీఆర్ కి ఇష్టమైన ప్రదేశంలో రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి… వీడియో వైరల్!

Akashavani

Sree Reddy: సంచలన తార, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె సినిమాలలో కన్నా వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ రకాల వంటలను తయారు చేసి ప్రేక్షకులను సందడి చేస్తున్న శ్రీ రెడ్డి తాజాగా గోవా వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ గోవాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. గోవా వెళ్లిన శ్రీరెడ్డి తను ఉన్నటువంటి విల్లాను యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించడమే కాకుండా గోవా అందాలను కూడా అభిమానులకు వీడియో ద్వారా పరిచయం చేశారు.ఈ వీడియోలో భాగంగా శ్రీరెడ్డి గోవాలో ఎన్నో రకాల వంటలను చేస్తూ ఆ వీడియోలను కూడా షేర్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇకపోతే గోవాలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన ప్రదేశాలను కూడా ఈమె చూపించారు.

Sree Reddy: గోవా అందాలను చూపించిన శ్రీ రెడ్డి…

జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన టెంపర్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఆ ప్రదేశం అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమని గతంలో ఎన్టీఆర్ తెలియజేశారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన ప్రదేశాలను కూడా శ్రీరెడ్డి సందర్శించి ఆ ప్రదేశాలను అభిమానులకు చూపించారు. గోవా వెళ్లిన శ్రీరెడ్డి గోవా అందాలతో పాటు, కురచ దుస్తులు ధరించి తన అందాలను కూడా ఆరబోసి ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా ఈమె గోవా వెకేషన్ కి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీరెడ్డి చూపించిన ఆ గోవా అందాలపై మీరు ఓ లుక్కేయండి.

 

- Advertisement -