Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో కాస్త వివాదాలకు దూరమైనప్పటికీ, ఏ విషయం గురించి అయినా తాను మాట్లాడింది అంటే అవతలివారికి తనదైన స్టైల్ లో లెఫ్ట్ రైట్ ఇస్తుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి ఈమె స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా శ్రీ రెడ్డి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేసి తనకు ఓ రేంజ్ లో కోటింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఇలా హైపర్ ఆదిని శ్రీ రెడ్డి టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే….
హైపర్ ఆది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు అభిమాని అలాగే ఆయన జనసేన పార్టీకి కూడా తన సపోర్ట్ చేస్తాడనే విషయం మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పలుసార్లు వైసీపీ పార్టీపై ఆది నోరు జారుతూ ఉంటారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయటం వల్ల ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్నటువంటి రోజా తాజాగా జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలకు జబర్దస్త్ కమెడియన్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ పెద్ద ఎత్తున సందడి చేశారు.
Sri Reddy: డబ్బు కోసం ఏ గడ్డి అయినా తింటావా…
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పటికీ హైపర్ ఆది మాత్రం మాట్లాడలేదు. దీంతో శ్రీ రెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ పచ్చి బూతులతో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఆదిగాడికి డబ్బులు ఇస్తే గడ్డి తినడానికి కూడా వెనకాడడు.ఆదిగాడు తన కుక్క బుద్ధి చూపించుకున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలిచారంటూ ఈమె ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే ఎలాంటి ఎదవ పనైనా చేస్తావా అంటూ ఆదిని ప్రశ్నించింది. కొంపదీసి ఆదిగాడు మన పార్టీలో చేరిపోయారా? అయినా ఆదికి మన పార్టీ గాలి పడదు. ఇష్టం లేకపోతే రాకుండా ఉండాలి కానీ ఇలా డబ్బు కోసం రావడం ఏంటి అని ప్రశ్నించారు. ఆదిగాడు ఆకులో ఈకలాంటివాడు ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత వీడు రాకపోతే జగనన్న పుట్టినరోజు ఆగిపోదుగా.. ఆది ఒక సిగ్గులేని ఎదవ అంటూ పెద్ద ఎత్తున శ్రీరెడ్డి బండ బూతులు తిడుతూ ఆదిని ఓ రేంజ్ లో ఆడుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఆది గురించి శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.