Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి పరిచయం అవసరం లేని పేరు.గతంలో ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ప్రస్తుతం వివాదాలకు కాస్త దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన శ్రీరెడ్డి తెలుగు తమిళ భాషలలో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ రెడ్డి ఎన్నో రకాల వంటకాలను తయారు చేసి తన చేతి వంట రుచిని అందరికీ పరిచయం చేస్తున్నారు.ఈ విధంగా శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.
ఇలా వివిధ ప్రాంతాలలో ఫేమస్ అయినటువంటి వంటలను తయారు చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ శ్రీరెడ్డి పెద్ద ఎత్తున తన అభిమానులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా శ్రీ రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక వీడియోని షేర్ చేశారు. అయితే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో ఈమె వరలక్ష్మి వ్రతం కోసం ప్రత్యేకంగా కాంచీపురం వెళ్లి పట్టుచీరలను కొనుగోలు చేశారు. కాంచీపురం వెళ్లిన శ్రీ రెడ్డి ముందుగా కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రత్యేకతలు తెలిపారు.
Sri Reddy: వరలక్ష్మీ వ్రతం స్పెషల్…
ఈ విధంగా అమ్మవారి దర్శనం అనంతరం కాంచీపురంలో పట్టుచీరలు కొనుగోలు చేశారు. అక్కడ విభిన్న రకాల పట్టుచీరలను అభిమానులకు చూపించడమే కాకుండా పట్టుచీరలను ఎలా తయారు చేస్తారో కూడా చూపించారు.ఇకపోతే ఎవరికైనా నచ్చిన పట్టు చీరలు కావాలంటే వాట్స్అప్ ద్వారా కొనుగోలు చేయడానికి ఆమె వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇలా శ్రీ రెడ్డి రోజురోజుకు విభిన్న వీడియోల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.మొత్తానికి వరలక్ష్మీ వ్రతం కోసం శ్రీ రెడ్డి కాంచీపురం వెళ్లి పట్టుచీరలు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పట్టుచీరల షాపింగ్ వీడియో పై ఓ లుక్ వేయండి.