Sri Reddy: శ్రీ రెడ్డి సంచలన తారగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి లేదా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా శ్రీరెడ్డి తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఇవే మెగా ఫ్యామిలీ అంటే బుస కొట్టే పాములమెగా ఫ్యామిలీ పై విరుచుకుపడుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అలాగే నాగబాబు విషయంలో తరచూ శ్రీ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు.
తాజాగా మరోసారి ఈమె పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాష్ట్ర రాజకీయాలలోనూ ఎంతో బిజీగా ఉన్నారని తెలిపారు. ఇలా ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని కూడా ఈమె తెలియజేశారు. పవన్ వారాహి యాత్రలో పాల్గొంటే తనకోసం ఇంతమంది అభిమానులు వచ్చారని సంతోష పడాలో లేకపోతే వీరంతా రేపు ఓట్లు వేయరని బాధపడాలో పవన్ కళ్యాణ్ కు అర్థం కాలేదని చెప్పుకొచ్చారు.
Sri Reddy: అభిమానం ఓటు రూపంలో రాలేదు…
ఇలా పవన్ కళ్యాణ్ కివచ్చిన కష్టం ఏ పగోడీకి కూడా రాకూడదు పాపం అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పవన్ ఫాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ సైతం ఒకానొక సందర్భంలో తెలియజేశారు. మీరంతా అభిమానులుగా ఇక్కడికి వచ్చారు కానీ ఈ అభిమానం ఓట్ల రూపంలో తనకు రావడం లేదు అంటూ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.