Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు సంచలన తారగా పేరు సంపాదించుకున్నటువంటి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమాలకు శ్రీ రెడ్డి దూరంగా ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఈమె రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
ఇలా ఎప్పుడూ మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడే శ్రీరెడ్డి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ నిత్యామీనన్ చూడటానికి ఇంతే ఉంటుంది అంటూ ఆమె గురించి కామెంట్ చేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంతా గురించి కూడా ఈమె మాట్లాడుతూ సమంత స్టార్ హీరోయిన్ అయిన తన బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా టెంప్ట్ చేసేలా లేదు అంటూ బోల్డ్ కామెంట్ చేశారు. ఇక తమన్నలో తన బొడ్డు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ తన ఫేస్ మాత్రం చూడలేమని తెలిపారు.
Sri Reddy: నువ్వు కనీసం మనిషిలా కూడా అనిపించలేదు…
ఇకనటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ అసలు ఈ రకుల్ అమ్మాయా లేక అబ్బాయా అన్న విషయం కూడా అంతుచిక్కదు అంటూ శ్రీ రెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు హీరోయిన్ల అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నిన్ను చూస్తే కనీసం మనిషిలా కూడా అనిపించడం లేదు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.