Sri Reddy: నల్లి బొక్కల కూర వండుతూ రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!

Akashavani

Sri Reddy: శ్రీరెడ్డి ఒకప్పుడు న్యూస్ ఛానల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈమె పలువురు దర్శక నిర్మాతలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. ఈ క్రమంలోనే క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఈమె అప్పట్లో పెద్ద రచ్చ చేశారు. దీంతో ఈమె కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ అయ్యింది.ఇలా అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినీ ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

ఈ విధంగా సినిమా హీరోల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో వంటలక్కగా మారిపోయింది. ఈ క్రమంలోనే గరిట చేతపట్టి వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఆ వంట వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల వంటలను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా నల్లి బొక్కల కూర తయారు చేశారు. ఎంతో నాటుగా తయారైన శ్రీ రెడ్డి మసాలాలను దంచి కూర చేస్తుంటే చూడగానే ఆ కూరను తినాలనే భావన కలుగుతోంది.

Sri Reddy: నల్లి బొక్కల కూర వండుతూ రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!
Sri Reddy: నల్లి బొక్కల కూర వండుతూ రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!

Sri Reddy: తెలంగాణ స్పెషల్…

ఇప్పటివరకు వివిధ రకాల చేప కూరలు, కోడి మాంసం మేక మాంసం అంటూ ఆంధ్ర రుచులను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా నల్లి బొక్కలు కూరతో తెలంగాణ వారికి తన వంట రుచిని చూపిస్తోంది. మసాలా దంచి పెట్టిన ఈ కూరను కనుక తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అంటూ ఎంతో పచ్చిగా మాట్లాడింది. ఇలా విలేజ్ స్టైల్ లో నల్లి బొక్కల కూరను ఎలా తయారు చేయాలో చెబుతూ శ్రీ రెడ్డి ఈ కూరను తయారు చేశారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ నల్లి బొక్కలు కూరకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీ రెడ్డి స్టైల్ లోనే నల్లి బొక్కల కూరను ట్రై చేయండి.

- Advertisement -