Sri Reddy: శ్రీ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం అవసరం లేదు. ఈమె నటిగా పలు సినిమాలలో నటించినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకొని పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై తన గళం విప్పుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం నరేష్ ప్రగతి వ్యవహారం పై తనదైన శైలిలో కామెంట్ చేసిన శ్రీ రెడ్డి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంట వీడియోలను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈమె ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసి అందరికీ తన స్టైల్ లో వంటలు ఎలా చేయాలో చూపించారు.ఈమె వంట వీడియోలకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందాలను ఆరబోస్తూ చీరకట్టులో శ్రీరెడ్డి అచ్చం పల్లెటూరి యువతిల వంట వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈమె మటన్ తిల్లి అంటూ మరొక వెరైటీ వంటకం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.తనకు మటన్ తిల్లి అంటే ఎంతో ఇష్టమని చిన్నప్పుడు తన కోసమే తన తండ్రి ఉదయమే వెళ్లి మటన్ తిల్లి తీసుకువచ్చేవాడు అంటూ ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంది.

Sri Reddy: మటన్ తిల్లి ఆరోగ్య ప్రయోజనాలు వివరించిన శ్రీ రెడ్డి…
ఇకపోతే మటన్ తిల్లి ఎలా చేయాలో చెబుతూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉపయోగించారు. అలాగే మటన్ తిల్లి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో కూడా ఎంతో చక్కగా వివరించారు. ఇక ఈమె ఈ కూర వండడం చూస్తుంటేనే అందరికీ నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. అంత అద్భుతంగా కూరలు చేశారు. మరి శ్రీ రెడ్డి మటన్ తిల్లి ఏ విధంగా చేశారు.. తెలియాలంటే మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేసి శ్రీరెడ్డి స్టైల్ లోనే మీరు కూడా మటన్ తిల్లి ట్రై చేయండి.