Sri Reddy: చేప కూరను వండి… అనాథలకు స్వయంగా వడ్డించిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!

Akashavani

Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో పల్లెటూరి స్టైల్ లో వంటలు వండుతూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఇప్పటికే మేక కూర, చేపల పులుసు, కోడి మాంసం, పీతలు వంటి కూరలను ఎంతో అద్భుతంగా వండుతూ,తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరో సారి చేప కూరను వండిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా అందరి పై తీవ్రస్థాయిలో విరుచుకు పడే శ్రీరెడ్డి తనలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి చేపల కూర వండి ఆ కూరను ఎంతో మంది అనాధలకు వడ్డిస్తూ వారి ఆకలిని తీర్చారు. ఇలా శ్రీరెడ్డి అనాధలకు చేపల కూర వండి పెట్టడంతో ఎంతో మంది శ్రీరెడ్డిలో ఈ యాంగిల్ కూడా ఉందా…ఈమెలో కూడా ఈ విధమైనటువంటి మానవత్వం ఉందా అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sri Reddy: చేప కూరను వండి... అనాథలకు స్వయంగా వడ్డించిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!
Sri Reddy: చేప కూరను వండి… అనాథలకు స్వయంగా వడ్డించిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!

Sri Reddy:  రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి…

ఇకపోతే తాజాగా గోవా టూర్ వెళ్లిన శ్రీ రెడ్డి అక్కడ తాను ఉంటున్న విల్లాను తన అఫీషియల్ వీడియో ద్వారా చూపించారు. ఇక ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన ప్రదేశంలో శ్రీరెడ్డి సందడి చేశారు. ఇలా తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈమె చేపల కూరకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా శ్రీ గత కొద్ది రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గురించి తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.

- Advertisement -