Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఈమె వ్యక్తిగతంగా ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూసాం. నటిగా ఎక్కువ కాలం సాగలేకపోయిన కూడా గతంలో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ వివాదం బయటపెట్టి బాగా రచ్చ చేసి బాగా పరిచయాన్ని పెంచుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో హాట్ టాపిక్ గా నిలిచింది.
తన నోటికి వచ్చిన మాటలతో కొందరి సిని నటి నటులపై, రాజకీయ నాయకుపై బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్టుతో రచ్చ చేస్తుంది. తనకు కు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే.. శ్రీ రెడ్డి గతంలో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. అభిరామ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడు అని అప్పట్లో వారిద్దరు దిగిన ఫోటోలను పంచుకుంది. దీంతో అవి అభిరామ్ కెరీర్ కు బాగా అడ్డుపడ్డాయి. ఇక ఇదంతా పక్కన పెడితే ఇంతకాలం మౌనంగా ఉన్న శ్రీ రెడ్డి ఇయర్ ఎండింగ్ లో మరో బాంబు పేల్చింది.
Sri Reddy అక్కడ ఫస్ట్ నైట్ జరిగింది అంటూ బాంబు పేల్చిన శ్రీరెడ్డి..
ఇంతకు అసలు విషయం ఏంటంటే.. నానక్ రామ్ గూడా వద్దనున్న రామానాయుడు స్టూడియోను నిర్మాత సురేష్ బాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అక్కడ స్టూడియో ఉండదని శ్రీ రెడ్డికి తెలిసిన వెంటనే రియాక్ట్ అయింది. ఆ స్టూడియోను ఎందుకు కనుమరుగు చేస్తున్నార్రా అని ప్రశ్నించి.. నాకు.. దగ్గుబాటి అభిరామ్ కు అక్కడే ఫస్ట్ నైట్ జరిగింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఆ స్టూడియో ని తీసివేస్తే మా జ్ఞాపకాలు ఏమైపోవాలి అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈమె చేసిన కామెంట్లు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.