Sri Reddy: శ్రీ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చెన్నైలో కూడా శ్రీ రెడ్డి చాలా ఫేమస్. నటి కావాలన్న కోరికతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీరెడ్డికి సరైన అవకాశాలు లభించలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న మోసాల గురించి మీటూ ఉద్యమాన్ని ప్రేరేపించింది. శ్రీ రెడ్డి స్టార్ట్ చేసిన మీటు ఒక ఉద్యమంలా మారింది.దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి దైర్యంగ బయట పెడుతున్నారు. ఇక శ్రీ రెడ్డి కూడా అవకాశాలు లేకపోయినా కూడా తరచూ సినీ ప్రముఖుల మీద రాజకీయ నాయకుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన శ్రీరెడ్డి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. హోమ్ టూర్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ తో పాటు కుకింగ్ వీడియోస్ ద్వారా కూడా బాగా ఫేమస్ అయ్యింది. వంటలక్కగా మారిన తర్వాత శ్రీ రెడ్డి తన వంటల ద్వారా మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల వంటలను రుచి చూపించిన శ్రీరెడ్డి తాజాగా మరొక వంటకంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వేసవికాలంలో మామిడికాయ పచ్చడి చేస్తూ రెచ్చిపోయింది.
Sri Reddy: ఆవకాయ నేర్చుకోవడం కష్టం కాదు…
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో శ్రీ రెడ్డి ఎప్పటిలాగే అందాలతో కవ్వించే ప్రయత్నం చేసింది. అంతే మామిడికాయ పచ్చడి చేసే విధానం గురించి చెబుతూ మద్య మద్యలో డబుల్ మీనింగ్ డైలాగులతో కవ్వించింది. అంతేకాకుండా మామిడికాయల వల్ల కలిగే ప్రయోజనాలు మామిడికాయ పచ్చడి చేసుకునే విధానం గురించి తెలిపింది. ఈ కాలంలో ఎంతో కష్టపడి ఎన్నో కష్టమైన కోర్సులు నేర్చుకుంటున్నారని మన సాంప్రదాయమైన ఆవకాయ పచ్చడి నేర్చుకోవడం పెద్ద కష్టం కాదని తెలిపింది. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి చేసి వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇస్తే వారు ఆనందిస్తారని తెలిపింది.