Sri Reddy: సంచలన తార, వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ వంటలక్కగా మారిపోయారు.ఈ క్రమంలోనే గరిట చేతపట్టి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటలను తయారు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకే ఈమె ఎన్నో రకాల మాంసం కూరలను తయారు చేసి చూపించారు. గత కొద్ది రోజుల క్రితం పీతల కూరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీరెడ్డి తాజాగా పనస పొట్టు కూరతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం పనస పండ్ల సీజన్ కావడంతో శ్రీ రెడ్డి గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయినటువంటి పనసపొట్టు కూర తయారు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పనసపొట్టు కూర చేయటానికి మరీ లేతగా,మరి ముదురు పనస పండు కాకుండా మధ్యరకంగా ఉన్న పనస పండును తీసుకొని కూర చేస్తే ఎంతో రుచిగా ఉంటుందని తెలిపారు. పనస పండును ఏ విధంగా పొట్టు తీయాలి అనే విషయాన్ని శ్రీరెడ్డి ఎంతో వివరంగా తెలియజేశారు.ముఖ్యంగా పనసపండు గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అని అందుకోసమే తాను పనసపొట్టు కూర చేస్తున్నా అంటూ వెల్లడించారు.

Sri Reddy: డబుల్ మీనింగ్ డైలాగులు..
మాంసం తినని వారికి పనసపొట్టు కూర అచ్చం మాంసం రుచి కలిగి ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ వీడియో చేస్తూనే మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగులు వేశారు. ఈ విధంగా శ్రీ రెడ్డి పనసపొట్టు కూర ఎలా చేయాలో క్లుప్తంగా ఈ వీడియో ద్వారా వివరించారు. మొత్తానికి శ్రీ రెడ్డి ఎప్పటిలాగే అచ్చం పల్లెటూరి యువతి గా తన కట్టుబొట్టుతో,మాట తీరుతో ఈ వీడియో ద్వారా పనసపొట్టు కూరను చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం పనసపొట్టు కూరకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.