Sri Reddy: ప్రముఖ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి యాంకర్, నటి శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు . రాజకీయాలు సినిమా ఇలా ప్రతి ఒక్క విషయం లో తల దూర్చి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో పోస్టులు, చాట్, లైవ్ ఇలా అన్నిటిలో తన అందాలు ఆరబోస్తూ అభిమానులకు కను విందు చేస్తుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి.. మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి దుమ్మురేపుతోంది.
ఇక యూట్యూబ్‌లోను దుమ్ము రేపుతుంది. సాధారణంగా ఆమె యూట్యూబ్‌లో ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో వ్యూస్ వస్తాయి. అలాగే యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెకు భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయి.
ఇక శ్రీరెడ్డి సొంతంగా వంటకాలు చేస్తూ యూట్యూబ్ లో తన సొంత ఛానల్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఛానల్ లో ఆమె తన సొంత వంటకాల వీడియో లను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాను చేస్తున్న వంట వీడియోలకు ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా వీడియోలు చేస్తుంది.
ఎప్పుడు రకరకాల వంటకాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ప్రతి వీడియో లో పచ్చి బూతులు మాట్లాడుతూ వంటలు చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఇక శ్రీ రెడ్డి ఏ వీడియో లో అయిన బూతులు మాట్లాడడం సహజమే అయిపోయింది. అయినప్పటికీ ఆమెను ఆదరిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి కొందరు తిడుతున్న వారు ఉన్నారు.
Sri Reddy: శ్రీ రెడ్డి కు ఘాటు కౌంటర్ ఇచ్చిన నెటిజన్..
ఇక ఈమె ప్రతి సారి వీడియో లలో ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తూ అన్ని చూపించేస్తూ ఉంటుంది. వంటకాలు చేస్తూ ఇలా అవమానకరంగా ఆ ఎక్స్పోజింగ్ ఏంటి అంటూ పలువురు మహిళలు ఎప్పుడు ఆమెను ఎత్తిపోస్తునే ఉంటారు. ఇక ఇటీవల ఓ వీడియో లో ఆమె చేస్తున్న ఎక్స్పోజింగ్ కి ఓ నెటిజన్ వంటకాల వీడియో చేసి పోస్ట్ చేస్తున్నావు..అంత బానే ఉంది కానీ..ఆ ఎక్స్పోజింగ్ ఆపు.. నీ వల్ల ఆడవాళ్ళ పరువు పోతుంది చూసే వాళ్ళకి..అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి పై ఆ నెటిజన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.