Sri Sudha శ్రీ సుధ. ఈ మధ్యకాలంలో ఈ నటి తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. అయితే నటి శ్రీ సుదకి అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే నటి శ్రీ సుధ ఎంబిబిఎస్ చదువు పూర్తి చేసి కొంత కాలం పాటు డాక్టర్ గా కూడా పని చేసింది. కానీ నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ వృత్తి వదిలి ఇండస్ట్రీ వైపు వచ్చింది. కానీ ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఆఫర్లు వరించకపోవడం తో మళ్ళీ డాక్టర్ గా కొనసాగుతూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో శ్రీ సుధ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బాగానే షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బాత్ టబ్ లో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా కనిపించే శ్రీ సుధ ఒక్కసారిగా బాత్ టబ్ లో దిగినటువంటి ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాకుండా శ్రీ సుధ కి హీరోయిన్ కి కావలసిన క్వాలిటీస్ మెండుగా ఉన్నాయని కానీ అదృష్టం లేకపోవడంతో హీరోయిన్ కాలేకపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే శ్రీ సుధ తెలుగులో ఆమధ్య టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ తరహా పాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈ పాత్ర ఈ అమ్మడికి మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. కాగా నటి శ్రీ సుధా ఇటీవలే ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన క్రష్ చిత్రంలో ఓ బోల్డ్ తరహా పాత్రలో కనిపించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు లభించలేదు.