Srikanth Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యూట్యూబర్ శ్రీకాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ లో తనకు నచ్చిన విధంగా ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ వీడియోలు కొంతమందికి వినోదంగా అనిపించినా.. మరికొంత మందికి అన్ ఈజీ గానే అనిపిస్తాయి.
అలా అనిపించిన వారిలో ఒకరు కరాటే కళ్యాణి ఒకరు. శ్రీకాంత్ వీడియోలకు అసహనం వ్యక్తం చేసింది. వెంటనే తన బృందంతో వెళ్లి శ్రీకాంత్ ను నడిరోడ్డుపై చితకబాదింది. తద్వారా శ్రీకాంత్ రెడ్డి అందరి మీద విరుచుకు పడుతున్నాడు. శ్రీకాంత్ ను నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి పరిగెత్తించి మరి కొట్టినప్పటికీ అతని ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో నానుతూనే ఉన్నాడు.
ఇక కరాటే కళ్యాణి దెబ్బకి శ్రీకాంత్ రెడ్డి మైండ్ ఎలా చెదిరిపోయిందో అర్థం కావడం లేదు. ఎవరిని ఏ మాట అంటున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆర్జీవి సహాయంతో ఇండస్ట్రీ కి వచ్చాను అని చెప్పినా అతను ఇప్పుడు ఆర్జీవి ను కాళ్లతో తన్నినట్టుగా మాట్లాడుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ ను ఏకంగా బచ్చాగాడు అనేశాడు. వర్మ నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్క… వాడు నా ముందు బచ్చా.. ముసలోడు అని అంటున్నాడు.

Srikanth Reddy: శ్రీకాంత్ రెడ్డి వర్మ పై చేసిన మరో వ్యాఖ్యలు ఇవే!
ఇక దమ్ము ఉంటే నాతో డిబెట్ లో కూర్చోమను.. నాతో మాట్లాడమను.. నా కంటే గొప్పోడు ఏమీ కాదు అని శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నాడు. అంతేకాకుండా నేను వర్మని కించ పరచడం లేదు కానీ.. జనరేషన్ అప్ డేట్ అయ్యే కొద్ది కొత్తవాళ్ళు వస్తుంటారు. ప్రస్తుతం యువత వాళ్లే గొప్పఅని పెద్దవాళ్ల పంచాయతీ అయిపోయిందా అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆర్జీవి పై పలు వ్యాఖ్యలు చేశాడు.