SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి గురించి తెలుగు వాళ్లం మాట్లాడుకోవడం కాదు. యావత్తు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఎస్ఎస్ రాజమౌళిని చూసి ప్రతి తెలుగు వాడు గర్వించాలి. ఆయన తెలుగు ఇండస్ట్రీని గ్లోబ్ లో పెట్టారు. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోందంటే దానికి కారణం నూటికి నూరు శాతం రాజమౌళి. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అలా అని హిట్ కూడా కాలేదు. సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. ఆస్కార్ రేంజ్ కు వెళ్లాయి.
ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు మాత్రం రాజమౌళి నటించిన ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. నిజానికి రాజమౌళి పెద్దగా సినిమాల్లో కనిపించరు. తను దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా ఆయన కనిపించరు. ఏదో ఒక సెకన్ అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. కానీ.. ఆయన ఎక్కువ నిడివితో నటించిన సినిమా ఒకటుంది. అదే రెయిన్‌బో. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో కూడా దర్శకుడిగానే కనిపిస్తారు రాజమౌళి.
SS Rajamouli : 2008 లో వచ్చిన ఈ సినిమాను వీఎన్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు
ఈ సినిమా 2008 లో విడుదలైంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది వీఎన్ ఆదిత్య. హ్యాపీడేస్ రాహుల్, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కోడి రామకృష్ణ కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఇందులో రాజమౌళి నటించిన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీఎన్ ఆదిత్య చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఇందులో రాజమౌళి నటించారు అనే విషయం కూడా ఎవ్వరికీ గుర్తు లేదు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రస్తావన తేవడంతో ఈ న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది.