SS Thaman: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల అనేక మంది యువతీ యువకులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తమకు నచ్చిన సెలబ్రిటీలను పొగడటమే కాకుండా నచ్చని సెలబ్రిటీల గురించి వారి సినిమాల గురించి పెద్ద ఎత్తున హ్యాష్ టాగ్ ట్రెండ్ చేసి బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని టార్గెట్ చేసిన మహేష్ బాబు అభిమానులు మహేష్ నటించబోయే తదుపరి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా “తమన్ మాకొద్దు” అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వారిలో తమను కూడా ఒకరు. స్టార్ హీరోల సినిమాలకు తన మ్యూజిక్ అందించి వరుస హిట్లు అందుకుంటున్న తమన్ వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉంటూ అద్భుతమైన బిజిఎం లను అందిస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా కి సంగీతం అందించిన తమన్ ఈ సినిమా ద్వారా మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకి కూడా తమన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 టైటిల్ తో షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా తమ ఎంత అద్భుతమైన మ్యూజిక్ అందించినప్పటికీ ఈయన తరచూ కాపీ వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే
SS Thamanతమన్ ను రిజెక్ట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..
ఇలా తరచూ కాపీ ఇష్యూ ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్న తమన్ మా హీరో సినిమాకి వద్దు అంటూ “రిమూవ్ తమన్ SSMB 28” అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా మహేష్ బాబు అభిమానులు తమన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో కూడా తమన్ గురించి ఇలాంటి ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. తమన్ మాత్రం వాటి గురించి ఆలోచించకుండా తన ఫలితాలను చేసుకుంటూ అభిమానులకు మంచి సంగీతం అందించడానికి ప్రయత్త్నిస్తు ఉంటాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.