Star Actress: ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హిందూ సంప్రదాయాల ప్రకారం చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలను కనేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ముందు పిల్లలు తర్వాత పెళ్లి అన్న ధోరణి కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ధోరణి ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని చెప్పాలి.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నామనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఏకంగా పిల్లలకు జన్మనిస్తూ అనంతరం పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఈ కల్చర్ సౌత్ ఇండస్ట్రీలో కన్నా నార్త్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే గోవా బ్యూటీ ఇలియానా కూడా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానంటూ అందరికీ షాక్ ఇచ్చారు.
ఈ విధంగా ఇలియానా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇలియానా బాటలోనే మరొక స్టార్ హీరోయిన్ కూడా పయనిస్తున్నారని తెలుస్తుంది. ఈమె కూడా నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ అనంతరం సౌత్ ఇండస్ట్రీకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ సైతం తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అని త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
Star Actress: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్…
ఇలా గత కొంతకాలంగా తన ప్రియుడుతో ప్రేమలో ఉన్నటువంటి నటి ప్రస్తుతం గర్భిణీ అనే విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. అయితే త్వరలోనే ఈ విషయాన్ని ఈమె అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా ఇలియానా బాటలోనే మరొక హీరోయిన్ కూడా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నారన్న విషయం తెలియడంతో ఆ హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు.