Sunil: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గాను హీరో గాను విలన్ గాను నటించి మెప్పించినటువంటి వారిలో సునీల్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో భీమవరం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఇక్కడ ఎన్నో కష్టాలను పడుతూ చివరికి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నిలదొక్కుకున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సునీల్ ప్రాణ స్నేహితుడు అనే విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.
ఈ విధంగా త్రివిక్రమ్ సునీల్ మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఇకపోతే సునీల్ సినిమాలలో కమెడియన్ గా తన పంచ్ డైలాగులతో అందరిని ఎంతగానో నవ్విస్తారు.అయితే ఈయన సినిమాలలో ఎలా ఉంటారో షూటింగ్ అయిపోయిన తర్వాత సెట్ లో కూడా ఇతర సెలెబ్రిటీలతో అలాగే ఉంటారట. ఈ క్రమంలోనే ఒకరోజు షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత లొకేషన్ లోనే కూర్చొని అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీల పట్ల పంచ్ డైలాగ్స్ వేస్తూ అందరిని నవ్వించారు.
చేయి చేసుకున్న త్రిష…
ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిష కూడా అక్కడే ఉండడంతో ఆమెపై కూడా సునీల్ కామెడీ చేయడంతో కోపడినటువంటి త్రిష ఏకంగా సునీల్ చెంప పగలగొట్టారట. సునీల్ సరదాగా అందరిని నవ్వించడానికి ఇలా చేయగా ఆమె మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సునీల్ పై చేయి చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం సునీల్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదని ఆ విషయాన్ని అంతటితోనే మర్చిపోయారని తెలుస్తుంది. ఇకపోతే ఈయన అందాల రాముడు సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే .ఇందులో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. అయితే ముందుగా ఛాన్స్ త్రిష కే వచ్చిందట. కథ మొత్తం విని సినిమా బాగుంది హీరో ఎవరు అని అడగ్గా సునీల్ పేరు చెప్పగానే తనతో నేను నటించినని తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి కారణమైందని తెలుస్తుంది.